Rakshita | తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు గ్లామర్, ఎనర్జీతో ఆకట్టుకున్న హీరోయిన్లలో రక్షిత ఒకరు. తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె… ఇప్పుడు పూర్తిగా మారిపోయిన లుక్‌తో మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. ఇడియట్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన రక్షిత… తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఆ సినిమా విజయంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.
‘శివమణి’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘నిజం’, ‘లక్ష్మీ నరసింహా’, ‘ఆంధ్రావాలా’, ‘అందరివాడు’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.
అదే సమయంలో కన్నడ సినిమాల్లో కూడా నటిస్తూ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలోనే రక్షిత, కన్నడ దర్శకుడు ప్రేమ్‌తో ప్రేమలో పడి, అతన్ని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై కుటుంబ జీవితానికే ప్రాధాన్యం ఇచ్చారు. సినిమాలకు దూరమైన తర్వాత రక్షిత లుక్‌లో వచ్చిన మార్పు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒకప్పుడు స్లిమ్, గ్లామరస్‌గా కనిపించిన ఆమె… ఇప్పుడు పూర్తిగా భిన్నంగా కనిపించడం నెటిజెన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది నిజంగా అదే రక్షితనా? అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. తాజాగా ఆమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది.
ఆమె లేటెస్ట్ ఫోటోలను చూసిన కొందరు నెటిజెన్స్ “ఎలా ఉండేదానివి ఎలా అయ్యావు?”, “కొంచెం వర్కౌట్స్ చేస్తే బాగుంటుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు కొంతమంది అభిమానులు మాత్రం ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, ఇలా కామెంట్స్ చేయడం సరికాదని అంటున్నారు. సినిమాలకు దూరమైన తర్వాత రక్షిత పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయిస్తున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రక్షిత… ఇప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఆమె లుక్‌పై ఎలాంటి చర్చలు జరిగినా… తన జీవన విధానాన్ని ఆమె ఎంచుకున్నదే ముఖ్యమని చెప్పాలి.