Sapta Sagaralu Dhaati Trailer | 777 చార్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి ( Rakshit Shetty) . ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన కన్నడ చిత్రం Sapta Sagaradaache Ello తెలుగులో సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati) . హేమంత్ ఎం రావు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ను న్యాచురల్ స్టార్ నాని డిజిటల్‌గా లాంఛ్ చేశాడు.
మొన్న ఎంతమంచి కల వచ్చిందో తెలుసా. మా ఊరిలో సముద్రం ఉంది కదా.. నిన్నక్కడికి తీసుకెళ్లాను. అక్కడ చుట్టుపక్కల ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు మను. ఆ బీచ్‌లో నువ్వు నేను మాత్రమే ఉన్నాం.. అంటూ హీరోయిన్ తన ప్రియుడితో మాట్లాడుతున్న సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. అనుకోని కారణాల వల్ల హీరో జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది సస్పెన్స్‌లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. నీకెప్పుడూ చెప్పలేదు కానీ నా సముద్రానివి నువ్వు అంటూ హీరోయిన్ చెబుతున్న మాటలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా సాగుతున్నాయి.
ఛైత్ర జే అచర్ అచ్యుత్ కుమార్ పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చరణ్‌రాజ్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ లీడింగ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 22న విడుదల కానుంది.
సప్త సాగరాలు దాటి ట్రైలర్..
Here’s the trailer of #SaptaSagaraluDhaati, Heard so much about this beautiful love story. Can’t wait to watch.
Wishing my dear friend @rakshitshetty & the entire team all the very best for the Telugu release. 🤗https://t.co/D1gLHYLvU0
Experience the epic love story in…
— Nani (@NameisNani) September 19, 2023