Rakshit Shetty ‘777 Charlie’ Trailer | ‘కేజీఎఫ్’ చిత్రంతో కన్నడ సినిమాలకు ప్రస్తుతం ఆదరణ పెరిగింది. ఇంతకు ముందు కన్నడ సినిమాలను లెక్కే చేయని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలలో వెతికి మరి కన్నడ సినిమాలను చూస్తున్నారు. కన్నడ హీరోలలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మరో హీరో రక్షిత్ శెట్టి. ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకున్న రక్షిత్ శెట్టి ‘777 చార్లీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో బాబీ సింహా, సంగీత శృంగేరీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర బృందం మొదటి నుంచే విభిన్నంగా అప్డేట్లను ప్రకటిస్తూ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘నా పేరు ధర్మ. నా వరకు నేను కరెక్ట్.. కానీ చూసే వాళ్ళ దృష్టిలో నేను రాంగ్. ఇల్లు ఫ్యాక్టరీ, గొడవ, ఇడ్లీ, సిగరెట్, బీర్ ఇంతే నా లైఫ్. ఇంట్రెస్టింగ్గా వేరే ఏం లేదు’ అంటూ రక్షిత్ శెట్టి పలికే సంభాషణలు తన పాత్ర ఎలా ఉంటుందో తెలుపుతున్నాయి. అనుకోకుండా ఒక కుక్క తన దగ్గరకి వస్తే దాన్ని ఎలా వదిలించుకోవాలి అని రక్షిత్ పడే పాట్లు.. ఈ క్రమంలో కుక్కతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటం, తర్వాత ఆ కుక్క తప్పిపోతే.. దాన్ని వెతికే క్రమంలో ఈయన పడిన కష్టాలేంటి అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. చివర్లో ‘చార్లీ నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావ్’ అంటూ వచ్చే డైలాగ్ ఎమోషనల్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ సంస్థ విడుదల చేస్తున్నాడు. నోబిన్ పాల్ సంగీతం ఆకట్టుకుంటుంది. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 10న విడుదల కానుంది.
Presenting to you the magical moments of Dharma and Charlie. #777CharlieTrailer is out now! ✨
▶️ https://t.co/CyRig9mOPj#777Charlie in cinemas from June 10. @rakshitshetty @Kiranraj61 @RanaDaggubati @ParamvahStudios pic.twitter.com/En85b7CCTC
— Suresh Productions (@SureshProdns) May 16, 2022