రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయిమోహన్ ఉబ్బన దర్శకుడు. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు. గోదావరి నేపథ్యంలో సాగే ప్రేమకథగా హృద్యమైన సన్నివేశాలతో ట్రైలర్ను తీర్చిదిద్దారు. ప్రేమకోసం ఓ యువకుడి ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్ సాగింది.
‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చినా యుద్ధం చేయాల్సిందే’ అంటూ హీరోకి ఆయన తండ్రి చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. గోదావరి బ్యాక్డ్రాప్లోని విజువల్స్ మెప్పించాయి. శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, నిర్మాతలు: అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల, దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన.