రణ్‌వీర్‌సింగ్, అలియాభట్ జంటగా కరణ్‌జోహార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఆరేండ్ల విరామం తర్వాత కరణ్‌జోహార్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం..‘గల్లీబాయ్’ చిత్రం తర్వాత రణ్వీర్-అలియా జోడీ నటించిన చిత్రమిదే కావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
ఈ చిత్ర టీజర్‌ను నేడు విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చక్కటి ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా తనదైన శైలి మేకింగ్‌తో కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అంటున్నారు. ‘ఓ హృద్యమైన ప్రేమకథను ఆస్వాదించడానికి అందరూ సిద్ధంగా ఉండండి’ అంటూ కరణ్‌జోహార్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ సినిమాపై స్పందించారు.