Raju weds Rambhai | ‘నీదీ నాదీ ఒకే కథ’ (Needi naadi Okate katha), విరాట పర్వం (virataparwam) సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. అయితే విరాటపర్వం తరవాత వేణు నుంచి మరో సినిమా రాలేదు. ఇదిలావుంటే చాలా రోజుల తర్వాత నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వేణు. ఆయన నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ‘రాజు వెడ్స్ రాంబాయ్’ (Raju weds Rambhai). ఈ సినిమాకు శైలు కంపాటి దర్శకత్వం వహిస్తుండగా.. ఈటీవీ విన్‌తో కలిసి వేణు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించే వారి గురించి ప్రకటించకుండానే తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
నా పేరు యనగంటి రాంబాయి.. మా నాన్న పేరు యనగంటి వెంకన్న అంటూ ఫిమేల్ వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. నేను మా ఊళ్లనే ఒక అబ్బాయిని ప్రేమించిన.. వాడి పేరు రాజు. నిజానికి ఒక అమ్మాయికి ప్రేమించడానికి కావాల్సిన అర్హతలు వాడి దగ్గర ఒక్కటి కూడా లేవు. కానీ వాడు బ్యాండు కొట్టుడు చూసి పడిపోయిన. బోగ్గుతోని మా ఇల్లందు మండలంకి ఎంతపేరు వచ్చిందో మా ప్రేమతో మా ఊరికి అంతా పేరు వచ్చింది. మా ప్రేమ ఒక తీన్మార్…ఒక దోమార్…. ఒక నాగిని ఇంట్లాంటి మా కథను శైలు కంపాటి సార్ సినిమా తీస్తుండు అంటూ టీజర్‌ను కట్ చేశారు మేకర్స్. చూస్తుంటే న్యూ ఏజ్ లవ్ స్టోరీలాగా ఉంది చిత్రం. ఇక తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల మధ్య ఉన్న గ్రామంలోని నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 14 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
“రాజు వెడ్స్ రాంబాయి” –
వీళ్ళ ప్రేమ ఒక తీన్మార్…
ఒక దోమార్….
ఒక నాగిని…..!…త్వరలో మీ అభిమాన థియేటర్స్ లో@dsfofficial_ @Moonsoontal2444 @venuudugulafilm @rahulmopidev @sureshbobbili9@nareshadupa @GNadikudikar @saailukampati pic.twitter.com/npiHuoglhr
— v e n u u d u g u l a (@venuudugulafilm) November 19, 2024