శివకోన, ప్రభాకర్, నేహా దేశ్పాండే, కునాల్ కౌశల్, అభిలాష్, రమ్యదేవ్, ప్రాచీ కేథర్ ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘రాజు గారి కోడిపలావ్’. శివకోన స్వీయ దర్శకత్వంలో అనిల్ మోదుగతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 4న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక, నిర్మాత శివకోన మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో వినోదంతో పాటు అన్ని అంశాలు వున్నాయి.
కొత్తదనం వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను’ అన్నారు. ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందని, ఇది కంటెంట్ పరంగా పెద్ద సినిమాలా వుంటుందని ప్రభాకర్ తెలిపారు. ఈ సమావేశంలో చిత్రం నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.