Dunki Drop 5 | మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి డంకీ (Dunki). రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. డంకీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటరల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో అందరినీ ఖుషీ చేస్తుంది బాద్ షా టీం. ఇప్పటికే Dunki Drop 1, Dunki Drop 2 , Dunki Drop 3, Dunki Drop 4 అంటూ ఎక్జయిటింగ్ అప్డేట్స్ ను షేర్ చేసుకోగా.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా Dunki Drop 5 ఎప్పుడో చెప్పాడు రాజ్ కుమార్ హిరానీ. OMaahi ప్రమోషనల్ వీడియో త్వరలోనే మీ ముందుకొస్తుంది.. అంటూ ట్వీట్ చేశారు రాజ్ కుమార్ హిరానీ. ఇప్పుడీ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు షారుఖ్‌ఖాన్ ఫ్యాన్స్.
ఇప్పటికే లాంఛ్ చేసిన Dunki Drop 1 ఫస్ట్ వీడియో,ఇంట్రెస్టింగ్ పోస్టర్లు ప్రతీ ఒక్కరి అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటున్నాయి. Dunki Drop 2 రూపంలో విడుదల చేసిన డంకీ ఫస్ట్ సింగిల్ Lutt Putt Gaya సాంగ్ హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్‌తో షారుఖ్ ఖాన్ ఫుల్ ఎనర్జీతో ఫన్‌గా సాగుతోంది. షారుఖ్‌ఖాన్ ఎనర్జీ లెవల్స్‌తో సాగే డ్యాన్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందించేలా ఉన్నాయి.
ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అభిజాత్ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్ కథనందిస్తున్నారు. ఈ ఏడాది జవాన్‌తో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన షారుఖ్‌ఖాన్.. మరో హిట్టు కొట్టడం ఖాయమని చెప్పకనే చెబుతోంది.
Dunki Drop 5 అప్డేట్..
Coming up….#DunkiDrop5 – #OMaahi Promotional Video Out Soon!#Dunki releasing worldwide in cinemas on 21st December, 2023. pic.twitter.com/HKiyOzBcPw
— Rajkumar Hirani (@RajkumarHirani) December 11, 2023
Lutt Putt Gaya సాంగ్..
Loved #LuttPuttGaya ❤️😍
Will be a Chartbuster for sure just like JJP and Chaleya#SRK doesn’t age at all, the energy mahn 🥵🥶
The innocence of 90s is full on in this song ❤️
And #SRK chemistry with #TaapseePannu spot on
Cute!! 😍
A must needed break from Action movies!! pic.twitter.com/UNp6ihCpiZ
— 𝙰𝚗𝚞𝚓 🇮🇳𝚂𝚁𝙺𝚒𝚊𝚗🇮🇳 (@anujrocks44) November 22, 2023
Dunki Drop 1 ఫస్ట్ వీడియో..