కూలీకి 150కోట్లు?
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వయసు కూడా ప్రభావం చూపించలేకపోతున్నది. ఏడు పదులు దాటినా తలైవా ఇమేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వయసు కూడా ప్రభావం చూపించలేకపోతున్నది. ఏడు పదులు దాటినా తలైవా ఇమేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆయన సినిమా విజయం సాధిస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ‘జైలర్’ సినిమాతో నిరూపణ అయ్యింది. 220కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 650కోట్లు వసూలు చేసి, రజనీకాంత్ స్టామినా ఏంటో తెలియజెప్పింది. ప్రస్తుతం ‘కూలీ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు రజనీ. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ సినిమాకోసం కోట్లాదిమంది తలైవా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే.. ‘కూలీ’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. ఈ సినిమాలో నటించినందుకు గాను 150కోట్ల పారితోషికాన్ని రజనీకాంత్ అందుకున్నారనేది ఆ వార్త సారాంశం.
ఇదే గనుక నిజమైతే.. ఇండియాలోనే రికార్డుగా నిలుస్తుందని అంటున్నారు. భాగస్వామ్యం, పర్సంటేజ్ విధానాలతో ప్రమేయం లేకుండా, కేవలం పారితోషికంగా మాత్రమే 150కోట్లు తీసుకోవడం దేశంలోనే రికార్డట. నిజానికి ఈ సినిమా బడ్జెట్ 375 కోట్లని తెలుస్తున్నది. అందులో రజనీ 150కోట్లు, లోకేష్ కనకరాజ్ 50కోట్లు పారితోషికాలను అందుకోగా, ఇతర పారితోషికాలు, సినిమా మేకింగ్‌కి మిగిలిన 275కోట్లు ఖర్చుపెడతారన్నమాట. మరో విషయం ఏంటంటే.. ఇప్పటికే ఈ సినిమాకు 240కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. ఇంకా జరగాల్సిన బిజినెస్ చాలా ఉంది. మొత్తం మీద సినిమా నిర్మాత కళానిధి మారన్ ఇప్పటికే సేఫ్ జోన్లోకి వచ్చేశారన్నమాట. మరి తలైవానా మజాకా!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

