Rajinikanth | సౌత్ ఇండియన్ సినిమా రంగంలో లెజెండరీ స్థానం సంపాదించిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. సినీ రంగంలో 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. తన వయసును బేఖాతర్ చేసి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు తలైవా. 74 ఏళ్ల వయస్సులోనూ రజినీ ఎనర్జీ చూసి అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా రజినీకాంత్ ఒక ఫిట్నెస్ వీడియోతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, తలైవా తన పర్సనల్ ట్రైనర్ పర్యవేక్షణలో జిమ్‌లో శ్రమిస్తున్నారు. మొదట ‘ఇన్‌క్లైన్ డంబెల్ ప్రెస్’ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత బెంచ్‌పై కూర్చుని స్క్వాట్స్ చేస్తూ తన కాలి కండరాలకు శ్రమ పెట్టారు.
చివర్లో ట్రైనర్‌తో కలిసి కండలు చూపిస్తూ స్మైల్ ఇస్తున్నారు. ఈ వయసులోనూ ఇంత అంకితభావంతో ఫిట్నెస్ పై ఫోకస్ చేయడం నిజంగా యూత్‌కు ఆదర్శంగా నిలుస్తోంది.ఆధ్యాత్మికత, నిశ్చితమైన జీవన శైలి, డిసిప్లిన్‌తో రజినీకాంత్ తన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటున్నారు. రాజకీయాల్లోకి రాకపోవడానికి ఆరోగ్యమే కారణమని గతంలో చెప్పిన తలైవా, ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కూలీ’ ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదలై భారీ స్పందన తెచ్చుకుంది.సినిమాలో నాగార్జున అక్కినేని విలన్ పాత్రలో మెరిశారు.మలయాళ స్టార్ సౌబిన్ షాహిర్, కన్నడ హీరో ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, రచ్చిత రామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్‌తో ఆకట్టుకున్నారు. పూజా హెగ్డే చేసిన ‘మోనికా అంట’ స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాటపై లక్షల రీల్స్ చేస్తుండగా, మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే ఎన్ని తరాలు మారినా, ఎంత మంది కొత్త హీరోలు వచ్చినా, రజినీకాంత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. 50 ఏళ్ల సినీ ప్రస్థానం, 100కుపైగా సినిమాలు, అద్భుతమైన ఫిట్నెస్ ఇవన్నీ తలైవాను ప్రత్యేకంగా నిలబెడుతున్న అంశాలు. ప్రస్తుతం రజినీకాంత్ కొత్త ప్రాజెక్టుల కోసం స్క్రిప్ట్‌లు వింటున్నట్టు సమాచారం.
Superstar workout 🏋️♂️❤️🔥pic.twitter.com/arASMUgVO3
— AmuthaBharathi (@CinemaWithAB) August 15, 2025