Coolie | రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున అతిథి పాత్రలో నటిస్తున్నారు. గురువారం ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆయన సైమన్ అనే పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.