తమిళ కమెడీయన్ వివేక్ హఠాన్మరణం కోలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. నటుడిగాను, మంచి మనిషిగాను, ప్రకృతి ప్రేమికుడిగా ఎందరో మనసులు గెలుచుకున్న వివేక్ ఇక మన మధ్య లేరని తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్ ద్వారా వివేక్‌కు సంతాపం తెలియజేస్తూ శివాజీ సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో కలిసి పని చేసిన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
రజనీకాంత్ తన ట్విట్టర్లో .. సామాజిక కార్యకర్త, నా ప్రియమైన స్నేహితుడు వివేక్ మరణ వార్త నాకు చాలా బాధ కలిగించింది. శివాజీ చిత్రీకరణ సమయంలో ఆయనతో పని చేసిన క్షణం మరపురానిది. వివేక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని రజనీకాంత్ తమిళ్లో ట్వీట్ చేశారు.
#RipVivek pic.twitter.com/MSYVv9smsY
— Rajinikanth (@rajinikanth) April 17, 2021