Rajinikanth praises Dragon | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమాలు షూటింగ్ లేని టైంలో ఇంట్లో ఉండి సినిమాలు చూస్తాడని కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఇలా చూసిన సినిమాలలో తనకి ఏదైన సినిమా నచ్చితే ఆ సినిమా యూనిట్ ఇంటికి పిలిపించుకుని మరి అభినందిస్తాడు. గతేడాది ఇలానే విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా చూసిన తలైవా ఆ సినిమా దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌ను కలుసుకుని ప్రత్యేకంగా అభినందించాడు. ఇప్పుడు తాజాగా డ్రాగన్ సినిమా చూసిన రజనీ చిత్ర దర్శకుడిని ఇంటికి పిలిపించుకుని మరి అభినందించాడు.
తమిళంతో పాటు తెలుగులో వచ్చి సూపర్ హిట్ అందుకున్న చిత్రం డ్రాగన్. లవ్ టుడే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో హీరోగా నటించగా.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, జార్జ్ మరియన్, కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ మేనన్, మిస్కిన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిత్రం విడుదలైన పది రోజుల్లోనే రూ.100 కోట్లను వసూలు చేసింది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా చూసిన రజనీకాంత్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు దర్శకుడు అశ్వత్ మారిముత్తుని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించాడు. ఇక రజనీతో దిగిన ఫోటోలను దర్శకుడు అశ్వత్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
రజనీ సర్ డ్రాగన్ సినిమా చూసి.. ఎంత అద్భుతమైన రచన అశ్వత్! అద్భుతంగా తీశావు అంటూ అభినందనలు తెలిపాడు. ”మా లాంటి దర్శకులందరికీ ఒకటే కల. మంచి సినిమా తీయాలి. ఆ సినిమా రజనీ సర్ చూసి మనల్ని తన ఇంటికి పిలిచి శుభాకాంక్షలు చెప్పాలి. మన సినిమా గురించి మాట్లాడాలి. అని డైరెక్టర్ కావాలని కష్టపడే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ యొక్క కల. ఈ రోజు నా కల నెరవేరిన రోజు” అంటూ అశ్వత్ రాసుకోచ్చాడు.
Rajini sir : what a writing Ashwath ! Fantastic fantastic !!🥹🥹
nalla padam pannanum, padatha pathutu Rajini sir veetuku kooptu wish panni namma padatha pathi pesanum !! Ithu director aganum nu kasta patu ozhaikra ovoru assistant director oda Kanavu ! Kanavu neraveriya nal… pic.twitter.com/IFuHhNkqjY— Ashwath Marimuthu (@Dir_Ashwath) March 5, 2025