Lal Salaam | జైలర్ సక్సెస్‌తో జోష్ మీదున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ.. ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో లాల్ సలామ్ (Lal Salaam) మూవీ చేస్తున్నాడని తెలిసిందే. లాల్‌సలామ్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు ఆగస్టులోనే అప్డేట్ అందించింది టీం. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించి.. అందరిలో జోష్ నింపుతోంది. లాల్ సలామ్ లో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాడు రజినీకాంత్.
లాల్‌సలామ్‌లో మోయినుద్దీన్ భాయ్ పాత్ర కోసం మన సూపర్ స్టార్ రజినీకాంత్ డబ్బింగ్ పూర్తి చేశాడని లైకా ప్రొడక్షన్స్ ఓ వీడియో షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లాల్ సలామ్ టైటిల్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఐశ్వర్య ‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’, ‘సినిమా వీరన్’ సినిమాలు తెరకెక్కించింది. సిల్వర్ స్క్రీన్‌పై తండ్రీకూతుళ్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. షూటింగ్ పూర్తయిన సందర్భంగా తలైవా, ఐశ్వర్య లాల్ సలామ్ యూనిట్‌తో సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
లాల్‌సలామ్ డబ్బింగ్..
The force of THALAIVAR is always unmatched! 🕴🏻 Our Superstar @rajinikanth has completed dubbing 🎙️ for MOIDEEN BHAI in #LalSalaam. 🔥
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj
✂️🎞️ @BPravinBaaskar… pic.twitter.com/jbe05Np94b— Lyca Productions (@LycaProductions) September 17, 2023
లాల్‌సలామ్ షూటింగ్ అప్డేట్..
As the shoot 📽️ of #LalSalaam is completely wrapped, the team get together once again to rejoice it! 🤗✨ Off to the post-production now!#LalSalaam 🫡
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj… pic.twitter.com/znDsyIfuzH— Lyca Productions (@LycaProductions) August 9, 2023