JAILER Official Show Case | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నాడు. జైలర్ ఆగస్టు 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తలైవా టీంప్రమోషన్స్లో బిజీగా ఉంది.అభిమానులు, ఫాలోవర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ JAILER Official Show Case రూపంలో వచ్చింది.
ఈ వ్యాధి వచ్చిన వాళ్లు మొదట పిల్లిపిల్లలాగా ఉంటారు.. దడేల్నా పులిగా మారతారు.. అంటూ రజినీకాంత్ క్యారెక్టర్ గురించి చెప్పే సంభాషణలతో సాగుతుంది. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు.. కోతలే.. అంటూ తలైవా తనదైన స్టైల్లో చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్, సునీల్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
జైలర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
జైలర్ Official Show Case..
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023