భద్రాద్రి ఏజెన్సీకే సీతారామ నీళ్లు ఇవ్వాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రుల జలదోపిడీని అరికట్టడంతోపాటు సీతారామ ప్రాజెక్టు జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకే అందించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు గుమ్మడి నర్స య్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కెచ్చెల రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులు, రాజీవ్ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లాకు నీటిని తరలించుకుపోతున్న ప్రాంతాన్ని మాస్‌లైన్ ప్రతినిధి బృందం మంగళవారం పరిశీలించింది.
- ఖమ్మం మంత్రుల జల దోపిడీని అరికట్టాలి
- ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్
జూలూరుపాడు, సెప్టెంబర్ 22: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రుల జలదోపిడీని అరికట్టడంతోపాటు సీతారామ ప్రాజెక్టు జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకే అందించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు గుమ్మడి నర్స య్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కెచ్చెల రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులు, రాజీవ్ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లాకు నీటిని తరలించుకుపోతున్న ప్రాంతాన్ని మాస్‌లైన్ ప్రతినిధి బృందం మంగళవారం పరిశీలించింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం జిల్లా రైతులు వేలాది ఎకరాల సాగు భూములను త్యాగం చేస్తే, వారికే చుక్కనీరు అందించకుండా ఇతర ప్రాంతాలకు జలాలను తరలించడం దారుణమని మండిపడ్డారు. ఉ మ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మం త్రులు భద్రాద్రి జిల్లాలో చివరి ప్రాంతమైన జూలూరుపాడు నుంచి ఖమ్మం జిల్లాకు నీటిని తరలిస్తూ, స్థానిక రైతాంగాన్ని విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

