Jailer | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తాజా చిత్రం జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునీల్, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ముందుగా అందించిన న్యూస్ ప్రకారం జైలర్ క్రేజీ అప్డేట్ ఏంటో చెప్పేశారు. అంతా అనుకున్నట్టుగా జైలర్ రిలీజ్ టైం గురించి రివీల్ చేశారు మేకర్స్.
జైలర్‌గా రజినీకాంత్ ఆగస్టు 10న వేట మొదలు పెట్టనున్నట్టు తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేశారు. సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్ నుంచి ఇప్పటికే విడుదలైన మోహన్ లాల్, సునీల్, తమన్నా (Tamannaah) పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు. రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. పాపులర్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
#Jailer is all set to hunt from August 10th💥 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcuts @KiranDrk @StunShiva8 #JailerFromAug10 pic.twitter.com/Wb7L0akJ4k
— Sun Pictures (@sunpictures) May 4, 2023
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023