Jailer | ఏడు పదుల వయస్సు దాటినా అభిమానుల కోసం తగ్గేదే లే అంటున్నాడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth). తలైవా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి జైలర్ (Jailer). యాక్షన్ కామెడీ జోనర్లో తెరకెక్కుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. రజినీకాంత్ నుంచి పూర్తిస్థాయి కామెడీ టచ్ ఉన్న సినిమా రాక చాలా కాలమే అవుతుంది. ఇప్పుడా లోటును జైలర్ భర్తీ చేస్తుందంటున్నాడు పాపులర్ కమెడియన్ యోగిబాబు (Yogibabu).
జైలర్‌లో వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్న యోగిబాబు సినిమా యూనిక్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని చెప్పి అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాడు. దర్బార్‌లో కామెడీ తక్కువగా ఉంటుంది. కానీ జైలర్‌లో ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రాక్స్ ఉండబోతున్నాయి. ఇందులో సూపర్ స్టార్ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్తో వినోదాన్ని పంచబోతున్నాడని చెప్పుకొచ్చాడు యోగిబాబు. మొత్తానికి చాలా రోజుల తర్వాత తలైవాలోని ఫన్ యాంగిల్‌ను చూడబోతున్నామంటూ ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు.
జైలర్‌లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునీల్, తమన్నా, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, వసంత్ రవి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జైలర్ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. జైలర్ ఆగస్టు 10న థియేటర్లలో సందడి చేయనుంది. జైలర్ నుంచి ఇప్పటికే విడుదల చేసిన మోహన్ లాల్, సునీల్, తమన్నాపోస్టర్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ.. అంచనాలు పెంచుతున్నాయిజైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు.
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023