Kantara| రిషబ్శెట్టికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్..!
Kantara| రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన చిత్ర ‘కాంతార’. ఇటీవల విడుదలైన ఈ కన్నడ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోన్న ఈ సినిమాకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. సామాన్య ప్రజలనే కాకుండా సెలబ్రిటీలను సైతం మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. నటుడు రిషబ్ శెట్టి, ఇతర చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Kantara| రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన చిత్రం ‘కాంతార’. ఇటీవల విడుదలైన ఈ కన్నడ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోన్న ఈ సినిమాకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. సామాన్య ప్రజలనే కాకుండా సెలబ్రిటీలను సైతం మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. నటుడు రిషబ్ శెట్టి, ఇతర చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న చిత్ర బృందం తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసింది. చెన్నైలోని ఆయన నివాసంలో చిత్ర బృందం సూపర్ స్టార్‌ను ప్రత్యేకంగా కలిసింది. ఈ సందర్భంగా రిషబ్ శెట్టిపై రజనీ కాంత్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రిషబ్ శెట్టికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్టు సినీ విశ్లేషకులు రమేశ్ బాల తెలిపారు. గోల్డ్ చైన్, లాకెట్‌ను బహుమతిగా అందించినట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న తెలుగులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.350కోట్ల వసూళ్లు సాధించిందీ చిత్రం.
#Superstar @rajinikanth to #Kantara 's @shetty_rishab :
Movies like #Kantara happen once in 50 years..#Superstar gifted him a Gold chain..
— Ramesh Bala (@rameshlaus) November 16, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

