Manjummel Boys | రజనీకాంత్‌ను కలుసుకున్న ‘మంజుమ్మెల్ బాయ్స్’ టీమ్
Manjummel Boys | చిన్న సినిమాగా విడుదలై మలయాళంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కేవలం రూ.5కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
Manjummel Boys | చిన్న సినిమాగా విడుదలై మలయాళంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కేవలం రూ.5కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే రీసెంట్గా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా రజనీకి బాగా నచ్చడంతో చిత్ర బృందాన్ని ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు. ఈ సినిమాలో నటించిన వారితో పాటు దర్శకుడి మేకింగ్ స్టైల్‌ను మెచ్చుకున్నారు. కాగా దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను చిదంబర్ పీ పొదువల్(Chidambaram S Poduval) దర్శకత్వం వహించగా.. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి, బాలు వర్గీస్, గణపతి, సీనియర్ నటుడు లాల్, అరుణ్ కురియన్, ఖలిడ్ రెహ్మాన్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, షెబిన్ బెన్సన్, లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2006లో తమిళనాడు కొడైకెనాల్లోని గుణ గుహలలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ గుణ గుహలను సందర్శించడానికి వెళ్లగా ఆ గ్యాంగ్‌లో ఒకరు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోతాడు. అయితే అతడిని కాపాడేందుకు అతని స్నేహితులు చేసిన రెస్క్యూ ఈ సినిమా స్టోరీ. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సినిమా రావడంతో ప్రేక్షకులు కాసులు వర్షం కురిపిస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం తెలుగులోకి రాబోతుంది. ఏప్రిల్ 05న ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు మేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

