సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 12న 71వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఆయన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. అభిమానులు, సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ అందించారు. అభిమానులు అయితే రజనీకాంత్ ఇంటి ముందు హంగామా సృష్టించారు.
రజనీకాంత్ తన 71వ బర్త్ డే వేడుకలని తన ఫ్యామిలీతో సింపుల్గా జరుపుకున్నాడు. కూతుళ్లు, మనవళ్ల మధ్య జరిగిన బర్త్ డే వేడుకలకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇవి చూసి ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. కాగా, రజనీకాంత్ సినిమాల్లో సంపాదించిన డబ్బులను ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగించారు. దీంతో ఆయన క్రేజ్ రెట్టింపు అయ్యింది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రంగంలో ఆయన చేసిన సేవలకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.
1975 లో గ్రేట్ డైరెక్టర్ బాలచందర్ తెరకెక్కించిన అపూర్వ రాగంగల్ సినిమాతో తొలిసారి తమిళ సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు రజనీకాంత్. అదే ఏడాది తెలుగులో తూర్పు పడమరగా విడుదలైంది ఈ చిత్రం. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నరజనీకాంత్ రీసెంట్గా అన్నాత్తె చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమా తెలుగులో పెద్దన్నగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Pics from Superstar @rajinikanth's Birthday Celebration with his Family pic.twitter.com/FgIbmRaeks
— BA Raju's Team (@baraju_SuperHit) December 13, 2021