రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తె’. శివ దర్శకుడు. నయనతార కథానాయిక. ఈ చిత్ర డబ్బింగ్ హక్కులను ఏషియన్ ఇన్ఫ్రా ఎస్టేట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో నారాయణ్‌దాస్ నారంగ్, సురేష్‌బాబు కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ సినిమాకు తెలుగులో ‘పెద్దన్న’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘అన్నాచెల్లెళ్ల అనుబంధానికి దర్పణంలా సాగే చిత్రమిది. రజనీకాంత్ శైలి యాక్షన్ అంశాలతో మెప్పిస్తుంది. తమిళ, తెలుగు భాషల్లో నవంబర్ 4న విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ స్వరకర్త.