Rajinikanth | ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు ముంచెత్తాయి. అయితే, నగరంలోని పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ విలాసవంతమైన విల్లా సైతం నీటిలో ముగినింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆయన ఇంట్లోకి నీరు చేరింది. ప్రస్తుతం వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలకు నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సూపర్‌స్టార్ రజనీ ఇంటి పరిసర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరద ఉన్నది. స్థానిక అధికారులు వెంటనే నీటిని బయటకు తీసేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే, వీడియోలో రజనీతో పాటు ఆయన కుటుంబీకులు ఎవరూ కనిపించలేదు.
రజనీకాంత్ ఇల్లు వరదలో చిక్కుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ చెన్నైలో వచ్చిన వరదల సమయంలోనూ ఇల్లు నీటమునిగింది. భారీ వర్షాలతో చెన్నైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. పలు సంస్థలు ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులకు సూచించాయి. వర్షాల నేపథ్యంలో చెన్నై కార్పొరేషన్ 1913 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. తమిళనాడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సహాయ కేంద్రం గురించి సమాచారం కోసం వాట్సాప్ కాంటాక్ట్ ఆప్షన్ (9445869848) అలాగే అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్‌లైన్ 1070 నెంబర్ని ఏర్పాటు చేసింది.
#Rains @rajinikanth
நடிகர் ரஜினிகாந்த் இல்லத்தை சூழ்ந்த மழைநீர்போயஸ் கார்டன் முழுவதும் பல்வேறு தெருக்களில் மழைநீர் சூழ்ந்துள்ளது@vinishsaravana @Vel_Vedha pic.twitter.com/qq3osSsAjQ
— Thamaraikani (@kani_twitz24) October 15, 2024