Rajinikanth| 90లలో కలిసి నటించిన హీరో, హీరోయిన్స్ ఇప్పటికీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అడపాదడపా కలుసుకుంటారు. ఫోన్ లు చేసి బాగోగులు తెలుసుకుంటారు. ఎవరికి కష్టమోచ్చిన తమ వంతు సాయం చేసుకుంటూ ఉంటారు. అలనాటి అందాల నటి రాధిక అయితే చాలా మంది హీరోలతో ఇప్పటికీ మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంది. 80, 90 దశకాల్లో రాధికగా చాలా బిజీ హీరోయిన్ కాగా దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించింది. తెలుగులో మెగాస్టర్ చిరంజీవి తో 25కు పైగా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు అక్కినేని నాగేశ్వరావు, కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్ లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు వయస్సు మీద పడడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయింది. మరోవైపు సీరియల్స్ కూడా నిర్మిస్తున్నారు.
సీనియర్ హీరో శరత్ కుమార్ ను మూడో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో కూడా సంతోషంగానే ఉంది. తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్, మోహన్, సత్యరాజ్ వంటి చాలా మంది హీరోలతో నటించారు. అయితే రజనీకాంత్ సరసన నటించిన ఎక్కువ మంది హీరోయిన్స్‌లో రాధిక ఒకరు. వారిద్దరి కాంబినేషన్లో మంచి వాడికి మంచివాడు, మూడు ముఖాలు, ఊర్కావలన్, పోకిరి రాజా, రంగా, నండ్రి మీండు వరుగ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ ఇద్దరు కలిసి చాలా సినిమాలలో నటించడం వలన వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఓ సందర్భంలో రజినీకాంత్ గురించి రాధిక ఒక సీక్రెట్ చెప్పారు.
ఒకరోజు రజినీకాంత్ ఒక ఫంక్షన్ కి రబ్బర్ చెప్పులు వేసుకొని రాగా, అది చూసిన రాధిక ‘మీరు పెద్ద నటుడు కదా… సూపర్ స్టార్ అని కూడా అంటారు కదా అని అన్నదట. దానికి స్పందించిన రజినీకాంత్ అవును… అవును అని సమాధానం ఇచ్చారట. వెంటనే రాధిక మరి ‘ఎందుకు ఇలా రబ్బరు చెప్పులు వేసుకొని వచ్చారు?’ అని రాధిక అడగడంతో తలైవా కాస్త సిగ్గు పడ్డాడట. ఇక అప్పటినుంచి రాధికని ఎక్కడ చూసినా ముందు చెప్పులే చూసుకుంటారట రజినీ. కోచ్చాడయ్యాన్ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్ళినప్పుడు, ఏంటి రజినీ షూ వేసుకున్నారు అని రాధిక అడగగా, ‘మీరు వచ్చారు కదా అందుకే కరెక్ట్ గా వేసుకున్నాను’ అని సూపర్ స్టార్ బదులిచ్చారంట. ఇద్దరి మధ్య స్నేహం ఉండడంతో వారిద్దరు ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకుంటారట.