Fauzi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ కాలికి విషపురుగు కాటేసిందని, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించారని ప్రచారం జరిగింది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రచారంపై రాజేష్ శర్మ వ్యక్తిగత సిబ్బంది వెంటనే స్పందించారు. ఆయన పీఏ సుభాశిష్ పాండా వీడియో విడుదల చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. ‘ఫౌజీ’ షూటింగ్లో ఎలాంటి ప్రమాదం జరగలేదని, విషపురుగు కాటేసిందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాజేష్ శర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాట నిజమేనని, అయితే అది మధుమేహం (డయాబెటిస్)కు సంబంధించిన ఆరోగ్య సమస్యల కారణంగానేనని తెలిపారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారని వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారానికి పూర్తి స్థాయిలో తెరపడింది. ఇక దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా యుద్ధ నేపథ్యంలోని ఫిక్షనల్ హిస్టారికల్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తుండగా, జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాజేష్ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, కమల్ కణ్ణన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. టీ-సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Actor #RajeshSharma Asst saying all social media is fake and that he got admitted due to Diabetes and doctors have said he will be discharged tomorrow. #Fauzi pic.twitter.com/RsB0aPEAZv
— Suresh PRO (@SureshPRO_) July 8, 2026