Rajendra Prasad | మంచి టాలెంట్ ఉన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య సభా సంస్కారం మరిచిపోయి తప్పుడు కామెంట్స్ చేస్తుండడంతో విమర్శల పాలవుతున్నారు. ఆ మధ్య వార్నర్‌పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన రాజేంద్ర ప్రసాద్.. రీసెంట్గా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ లో అలీని ఉద్దేశించి బూతు పదాన్ని ఉపయోగించి మాట్లాడాడు. అలానే నటి రోజాపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్‌పై తీవ్ర వ్యతిరేఖకత వ్యక్తం అవుతుంది. ఆయనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే రాజేంద్రప్రసాద్ ఉద్దేశ్యపూర్వకంగా తనపై కామెంట్స్ చేయలేదని అలీ స్వయంగా వివరణ ఇచ్చిన కూడా కొందరు మధ్యలోకి వచ్చి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
పలు సందర్భాల్లో రాజేంద్రప్రసాద్ నోరు జారడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం కామనే అని అంటున్నారు. పెద్ద ఇష్యూ నడుస్తున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్‌కి పశ్చాత్తాపం కూడా లేకపోగా, తాను మాట్లాడే మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని.. అది వాళ్ళ ఖర్మ.. సంస్కారం మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం ఏంటి? అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారని, అమ్మలాంటి బిడ్డ చనిపోవడంతో బాధలో ఉన్నాడని, కావాలని ఆయన అలా మాట్లాడలేదని ఆలీ వివరణ ఇచ్చిన కూడా కొందరు మాత్రం ఈ విషయంపై గట్టిగానే తమ వాదన వినిపిస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. నా మాట తీరును అలీ సీరియస్‌గా తీసుకోలేదు. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని కూడా అన్నాడు. అయినా, ఎవరో కావాలని దీనిని పెద్దది చేస్తున్నారు. మేమంతా ఒకరికొకరం ప్రేమతో ఉన్నాం. అలాంటి అనుబంధాలు లేకుంటే ఇంత కాలం కలిసి జర్నీ చేయలేము కదా. ఏది ఏమైన జరిగిన దానికి నేను చాలా హర్ట్ అయ్యాను. ఇకపై జీవితం అంతా ఎవరినైనా ‘మీరు’ అనే పిలుస్తాను. ఎప్పుడూ ‘నువ్వు’ అనే పదం వాడను. ఇది నేను ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్న నేర్పు. నేను మాట ఇస్తున్నాను… ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరినీ గౌరవంగా పిలుస్తాను అంటూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మరి ఇప్పటికైన ఆయనపై ట్రోలింగ్ ఆగుతుందా అనేది చూడాలి.