Shekhar Movie Release Date | గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రాజశేఖర్‌కు ‘గరుడ వేగ’ కాస్త ఊరటనిచ్చింది. 2017లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో రాజశేఖర్ కథలను ఎంపిక చేసుకునే విధానం కూడా మారింది. ఆ తర్వాత వచ్చిన కల్కి కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా మంచి ప్రశంసలు దక్కించుకుంది. రాజశేఖర్ కల్కి తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకుని శేఖర్ సినిమాతో పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. రాజశేఖర్ సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. మలయాళంలో సూపర్ హిట్టయిన జోసేఫ్ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు.
సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుదల కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రానికి మొదట లలిత్ దర్శకత్వం వహించాడు. కాని కొన్ని కారణాల వల్ల అతను తప్పుకున్నాడు. దాంతో జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బీరమ్ సుధాకర్ రెడ్డి నిర్మించాడు.