Extra Ordinary Man | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఎక్జయిటింగ్ అప్డేట్ను అందించారు మేకర్స్. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేశారు. టీంలోకి రాజశేఖర్ వెల్కమ్ చెప్పారు. మేకప్ వేసుకొని క్యారవాన్‌లో నుంచి దిగుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు ఇన్సైడ్ టాక్. మేకర్స్ ఈ సినిమా నుంచి డేంజర్ పిల్లా లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ ఇస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్.
నితిన్ ఈ చిత్రంతోపాటు వెంకీ కుడుముల డైరెక్షన్లో VNRTrio (వర్కింగ్ టైటిల్) కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. భీష్మ తర్వాత నితిన్, కన్నడ భామ రష్మిక మందన్నా, వెంకీ కుడుముల కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. VNRTrio చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నితిన్ గుబురు గడ్డంతో ఉన్న ఫస్ట్ లుక్ సినిమాపై హైప్ పెంచుతోంది.
Welcoming the Most Celebrated ANGRY MAN Dr.Rajashekar sir on the sets of our #Extraordinaryman 💐 I’m sure you’re going to stun everyone again Angry Man 🤗🤗
#Ext#ExtraordinarymanOnDEC8th pic.twitter.com/sHdV1HT55O— nithiin (@actor_nithiin) October 16, 2023
NITHIIN: ‘EXTRA’ RELEASE DATE ADVANCED TO 8 DEC… #Extra – Ordinary Man – starring #Nithiin – will now arrive in *cinemas* on 8 Dec 2023… Also featuring #SreeLeela, the #Telugu movie is being helmed by writer-turned-director #VakkanthamVamsi.
Produced by N Sudhakar Reddy and… pic.twitter.com/Udkr3T86dC
— taran adarsh (@taran_adarsh) October 9, 2023
డేంజర్ పిల్లా లిరికల్ వీడియో సాంగ్..
డేంజర్ పిల్లా లిరికల్ ప్రోమో..