ఫ్యామిలీ, యాక్షన్ హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సీనియర్ హీరో డా.రాజశేఖర్ (Rajasekhar). యాంగ్రీ యంగ్ మెన్‌గా పిలిపించుకునే ఈ యాక్టర్ సెకండ్ ఇన్నింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. గరుడ వేగ సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు, ఈ ఏడాది వచ్చిన శేఖర్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కాగా ఇపుడు కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది.
సేనాపతి ఫేం పవన్ సాదినేని (Pavan Sadineni) డైరెక్షన్లో నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు రాజశేఖర్. కాస్ట్ అండ్ క్రూ, మూవీ టైటిల్‌తో కూడిన ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ ఏంటో డీకోడ్ చేసేలా ప్రేక్షకులకు ఓ ఫజిల్ ను పోస్టర్లో చూపించారు మేకర్స్. ప్రేక్షకుల అటెన్షన్‌ను సినిమావైపు తిప్పుకోవడానికి మేకర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆలోచనతో రావడం ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే చెప్పాలి.
మల్కాపురం శివకుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. వివేక్ కలెపు కెమెరామెన్. రాజశేఖర్ 92వ (Rajasekhar 92nd Film) సినిమాగా వస్తున్న ఈ మూవీ షూటింగ్‌ను సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటనేది ఎవరైనా కనిపెడతారా..? లేదా..? అనేది చూడాలి.