మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 24, 2020 , 08:50:33

త‌న ట్వీట్‌పై వివ‌ర‌ణ ఇచ్చిన ర‌జ‌నీకాంత్

త‌న ట్వీట్‌పై వివ‌ర‌ణ ఇచ్చిన ర‌జ‌నీకాంత్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఇటీవ‌ల క‌రోనాకి సంబంధించి చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌ప్పుడు మెసేజ్‌ని జ‌నాల‌లోకి తీసుకెళ్ళేలా ట్వీట్ చేశారని భావించిన ట్విట్ట‌ర్ ఏకంగా ర‌జ‌నీకాంత్ చేసిన ట్వీట్‌ని తొల‌గించింది. దీనిపై గ‌త కొద్ది రోజులుగా హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డిచాయి. అయితే తాజాగా త‌న ట్వీట్‌పై వివ‌ర‌ణ ఇచ్చిన త‌లైవా.. నా వ్యాఖ్య‌ల‌ని త‌ప్పుగా అర్ధం చేసుకున్నార‌ని చెప్పుకొచ్చాడు.

ప్ర‌జ‌లు 12 గంట‌ల నుండి 14 గంట‌ల వ‌ర‌కు ఇంట్లో ఉంటే మూడో స్టేజ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉండ‌ద‌ని మాత్ర‌మే చెప్పిన‌ట్టు ర‌జ‌నీకాంత్ స్ప‌ష్టం చేశారు. త‌న వ్యాఖ్య‌ల‌ని ఆ రోజు మాత్ర‌మే చాలా అన్న‌ట్టు త‌ప్పుగా అర్ధం చేసుకున్నార‌ని, ఈ కార‌ణంగా ట్విట్ట‌ర్ కూడా త‌న ట్వీట్ తొల‌గించిందని ర‌జ‌కీంత్ పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ భారిన ప‌డ‌కుండా ఉండాలంటే స్వీయ నిర్భంధం త‌ప్ప‌ని స‌రిగా చేసుకోవాల‌ని సూపర్ స్టార్ పిలుపునిచ్చారు .


logo