RRR | ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఆ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. తాజాగా నాటు నాటు ఆస్కార్స్‌కు నామినేట్ అయ్యింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు స్టెప్పులు వేసిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్, కీరవాణి సంగీతం అందించారు. అయితే ఈ సినిమాపై ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కచ్చితంగా ఆస్కార్(Oscars) వస్తుందని తెలిపారు.
ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ పక్కా వస్తుందని తనకు నమ్మకం ఉంది. ఈ విజయాన్ని ప్రజలందరూ కలిసి వేడుకలా జరుపుకోవాలని అల్లు అరవింద్ అన్నారు. ఈ అవార్డును రాజమౌళి సినిమాకు వచ్చిన గుర్తింపుగా చూడకుండా.. తెలుగు సినిమాకు, ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవంగా చూడాలని. భారత్ నుంచి ఓ చిత్రం అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నందుకు గర్వపడాలని అరవింద్ పేర్కొన్నారు.
ఇది తెలుగు సినిమా పరిశ్రమకు గొప్ప ప్రోత్సాహం లాంటిందని.. ఆర్ఆర్ఆర్ సాధిస్తున్న అరుదైన విజయాలను ఆస్వాదించాలని అన్నారు.
మార్చి 12న ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం జరుగనుండగా.. ఈ వేడుక కోసం భారతీయ సినీ ప్రేమికులందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గుమ్మం ముందు నిలిచిన ‘నాటు నాటు’ పాటకు అవార్డు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు