Rajamouli | రాజమౌళి మహాభారతం పట్టాలెక్కేది అప్పుడే.. గుడ్‌న్యూస్ చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Rajamouli | అగ్ర దర్శకుడు రాజమౌళి కలల ప్రాజెక్ట్స్‌లో ‘మహాభారతం’ ఒకటి. ఈ చిత్రాన్ని దృశ్యమానం చేయడం తన జీవితాశయాల్లో ఒకటని రాజమౌళి అనేక సందర్భాల్లో చెప్పారు. మహాభారత కథను పలు భాగాల్లో సంపూర్ణంగా ఆవిష్కరించడానికి పదేళ్ల సమయం పట్టొచ్చని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి.
Rajamouli | అగ్ర దర్శకుడు రాజమౌళి కలల ప్రాజెక్ట్స్‌లో ‘మహాభారతం’ ఒకటి. ఈ చిత్రాన్ని దృశ్యమానం చేయడం తన జీవితాశయాల్లో ఒకటని రాజమౌళి అనేక సందర్భాల్లో చెప్పారు. మహాభారత కథను పలు భాగాల్లో సంపూర్ణంగా ఆవిష్కరించడానికి పదేళ్ల సమయం పట్టొచ్చని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి. తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మరో రెండుమూడేళ్ల తర్వాతే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
‘ ప్రస్తుతం మహేష్‌బాబు సినిమా సన్నాహాల్లో రాజమౌళి ఉన్నారు. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. భారీ హంగులతో తెరకెక్కించబోతున్నాం. ‘ఆర్ఆర్ఆర్’కు మించి ఉంటుంది. దీని తర్వాత ‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ చేయబోతున్నాం. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించే ఈ చిత్రానికి దర్శకుడెవరనేది ఇంకా నిర్ణయించలేదు. అయితే ఎవరు తీసినా రాజమౌళి పర్యవేక్షణలోనే సినిమా తెరకెక్కుతుంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాతే రాజమౌళి కలల సినిమా ‘మహాభారతం’ పట్టాలెక్కే అవకాశం ఉంటుంది’ అని విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

