Happy Birthday Rajamouli | తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వారిలో మొదటగా గుర్తుకువచ్చేది దిగ్గజ దర్శకుడు రాజమౌళి అని చెప్పక తప్పదు. ఈగ సినిమాతో ఇండియా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న జక్కన్న ఆ తర్వాత వచ్చిన బాహుబలితో ఒక్కసారిగా వరల్డ్ వైడ్‌గా పాపులర్‌గా మారాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో టాప్ 5లో కొనసాగుతుంది. అయితే ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చి ఇటీవల 10 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ రెండు భాగాలను కలిపి ఒకే పార్ట్‌గా కలిపి అక్టోబర్ 31న రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అయితే నేడు రాజమౌళి పుట్టినరోజు కావడంతో ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. బాహుబలి టీమ్ ఒక స్పెషల్ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో బాహుబలిని ప్రపంచ స్థాయి సినిమాగా మలచడానికి రాజమౌళి చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బిజ్జలదేవా మేకింగ్ సీన్ హైలైట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరు చూసేయండి.
SSRajamouli, BaahubaliMaking, HappyBirthdayRajamouli, BaahubaliReRelease, Tollywood,