Rajamouli to present brahmastra | రాజమౌళి ఇప్పుడు కేవలం తెలుగు దర్శకుడు కాదు.. పాన్ ఇండియా దర్శకుడు. ఈయన సినిమా అంటే అన్ని ఇండస్ట్రీల్లో సూపర్ క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత తన స్థాయిని అలా పెంచుకున్నాడు రాజమౌళి. బాలీవుడ్ దర్శకులు కూడా కొందరు ఇప్పుడు రాజమౌళిని చూసి చాలా నేర్చుకుంటున్నారు. రాజమౌళి చేసిన దాంట్లో తాము సగం చేస్తే చాలు అంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని అలా పెంచేశాడు రాజమౌళి. బాహుబలి సిరీస్‌తో 2 వేల కోట్ల క్లబ్బులో చేరిపోయాడు. అలాంటి దర్శకుడు పేరు పోస్టర్‌పై కనిపిస్తే సినిమాకు వచ్చే క్రేజ్ మరోలా ఉంటుంది. తాజాగా మరో బాలీవుడ్ సినిమా కూడా రాజమౌళి పేరు వాడుకుంటుంది. అదే బ్రహ్మాస్త్ర..
అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మూడు భాగాలుగా వస్తుంది. కరణ్ జోహార్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ప్రైమ్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రణబీర్ కపూర్, నాగార్జున అక్కినేని, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 9, 2022న బ్రహ్మాస్త్ర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా సౌత్ కోసం రాజమౌళిని ఎంచుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సమర్పకుడిగా ఉండటమే కాకుండా నిర్మాణంలో భాగం అయ్యాడు రాజమౌళి.
కరణ్ జోహార్‌తో గతంలో బాహుబలి సినిమా సమయంలో ఏర్పడిన స్నేహంతో.. ఇప్పుడు ఆయన నిర్మిస్తున్న సినిమాకు సౌత్ ప్రజెంటర్‌గా మారిపోయాడు జక్కన్న. బ్రహ్మాస్త్ర పోస్టర్‌పై రాజమౌళి పేరు కనిపిస్తే కచ్చితంగా సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని దర్శక నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. తాజాగా ఏర్పాటు చేసిన తెలుగు ప్రెస్ మీట్ లో హీరో రణబీర్ కపూర్ ఏకంగా రాజమౌళి కాళ్ళు మొక్కాడు. మొత్తానికి చూడలిక సౌత్ లో బ్రహ్మాస్త్ర మ్యాజిక్ ఎలా ఉండబోతుందో..!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
మిగిలిన రాష్ట్రాల్లో పుష్ప కలెక్షన్స్ ఎలా ఉన్నాయి.. బన్నీ హిట్ కొట్టాడా..?
Spider man No way Home | ఇండియాలో స్పైడర్ మ్యాన్ రికార్డుల మోత