Rajamouli| రాజమౌళి.. ఈ దర్శకుడు తెలుగు సినిమా స్థాయిని పతాక స్థాయికి చేర్చాడు. ఇప్పటి వరకు కూడా ఒక్క అపజయం అనేది లేకుండా వరుస హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన సినిమాలు చూసి హాలీవుడ్ స్టార్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రాజమౌళితో పనిచేయాలని టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ ఇలా అన్ని భాషల స్టార్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే జక్కన్న ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టాడు. తెలుగు హీరోలతో కలిసి అద్భుతాలు చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ దక్కేలా చేశాడు.
అయితే రాజమౌళి సినిమా రిలీజ్ కావడానికి కనీసం రెండు..మూడు సంవత్సరాలైనా పడుతుంది. అందులోనూ భాగాలు గా చేసి సినిమా తీస్తేగనుక అదే ప్రాంచైజీ మొత్తం పూర్తవ్వడానికి నాలుగైదేళ్లు పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘బాహుబలి’ మొదటి భాగం 2015 లో రిలీజ్ అయితే…రెండవ భాగం 2017లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కథ రాసి…పూర్తిచేసి రిలీజ్ చేయడానికి దాదాపు ఐదేళ్లు అయింది. ఇప్పుడు మహేష్ సినిమా ఎన్ని ఏళ్లు చేస్తాడనే చర్చ నడుస్తుంది. అయితే ప్రస్తుతం రాజమౌళి వయసు 51 ఏళ్లు. సినిమా రంగంలో ఎవరెంత కాలం పని చేస్తారు? అన్నది చెప్పలేం.
క్రియేటివ్ రంగంలో వయసు మీద పడే కొద్ది క్రియేటివ్ థాట్స్ తగ్గిపోతాయి. రాజ్ కుమార్ హిరాణీ, సంజయ్ లీలా భన్సాలీ లాంటి వాళ్లు ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. ఎక్కువగా థింక్ చేసిన వారు తక్కువ సినిమాలు చేశారు. అయితే రాజమౌళి కెరీర్ ఆరంభంలో వేగంగా సినిమాలు చేసి `బాహుబలి` నుంచి స్పీడ్ పూర్తిగా తగ్గించేసారు. మహేష్ సినిమా కోసం రాజమౌళి రెండేళ్లు సమయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీన్ని రెండు భాగాలుగా చేస్తే గనుక ఐదారేళ్లు అయిన పట్టే అవకాశం ఉంటుంది. మధ్యలో మరో సినిమా చేసే అవకాశం ఉంటుంది. అంటే అప్పటకి జక్కన్న 60కి చేరువ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే జక్కన్న స్పీడ్ పెంచితే అందరు హీరోలతో సినిమా చేసే అవకాశం ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.