మహేష్‌బాబుతో తెరకెక్కించబోతున్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఓ అంతర్జాతీయ ఈవెంట్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ..ఈ సినిమాలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని అన్నారు. ‘నాకు జంతువులంటే ఇష్టం. గతంలో నేను తీసిన చాలా చిత్రాల్లో జంతువులను ఉపయోగించాను. మహేష్‌బాబుతో తీయబోతున్న సినిమాలో మాత్రం ఎక్కువ జంతువులు కనిపిస్తాయి’ అని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.
అమెజాన్ అడవుల నేపథ్యంలో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో రాజమౌళి ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్‌పరంగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించబోతున్నారు. ఇందుకోసం ప్రముఖ హాలీవుడ్ సంస్థ ‘ఏ స్టూడియో’తో కలిసి పని చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని తెలిసింది. కథా విస్త్రృతి దృష్ట్యా రెండు పార్ట్లు అయితేనే సినిమాకు న్యాయం చేయగలమనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్‌ను పరిశీస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.