RRR Movie Sequel | ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చెక్కిన మరో దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు ‘బాహుబలి-2’ పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి తన పేరిట లిఖించుకుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌తో మరోసారి మాయ చేశాడు. ఈ చిత్రంతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఒక్కటేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను ట్రిపుల్ఆర్ సాధించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందా అంటే అవుననే అంటున్నాడు దర్శక దిగ్గజం రాజమౌళి.
తాజాగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ ఉంటుందని, సీక్వెల్‌కు సంబంధించిన స్టోరి డిస్కర్షన్స్ జరుగుతున్నాయిని తెలిపాడు. రచయిత విజేయంద్రప్రసాద్ స్టోరీని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్‌తో ‘SSMB29’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తుంది. అయితే సాధారణంగా రాజమౌళి ఒక్కో సినిమాకు రెండు సంవత్సరాల కంటే ఎక్కువే సమయం తీసుకుంటుంటాడు. ఈ లెక్కన చూసుకుంటే మహేషతో సినిమ పూర్తయ్యే సరికి 2025 అవుతుంది. ఆ తర్వాతే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. ఇటీవలే జపాన్‌లో ఆర్ఆర్ఆర్ రిలీజైన విషయం తెలసిందే. అక్కడ కూడా రోజు రోజుకు సినిమాపై విపరీతమైన ఆదరణ పెరుగుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం జపాన్‌లో సుమారు.12 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
Read Also:
Chiranjeevi | మరో మలయాళ రీమేక్‌పై కన్నేసిన చిరు.. ఈ సారైనా ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
సరోగసి కాన్సెప్ట్‌తో ఇన్ని సినిమాలొచ్చాయా.. అన్ని సూపర్ హిట్లే..!
Itlu Maredumilli Prajaneekam | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ట్రైలర్..!
విడాకుల తర్వాత తొలిసారి కలిసి నటించబోతున్న సమంత-నాగచైతన్య?