Surrogate Movies | ఈ మధ్య కాలంలో సరోగసి అనేది హాట్ టాపిక్ అయింది. పిల్లల్ని కనలేని పరిస్థితుల్లో ఉన్నవారు సరోగసి విధానంలో మాతృత్వాన్ని పొందుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇండియన్ సెలబ్రెటీలు సరోగసి ద్వారా పిల్నల్ని పోందారు. ఇక ఇటీవలే నయన్‌తార, విఘ్నష్ శివన్‌లు కూడా సరోగసి ద్వారానే తల్లిదండ్రులయ్యారు. కాగా ఈ సరోగసి అంశంపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవలే వచ్చిన యశోద కూడా సరోగసి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కింది. అయితే అలాంటి పాత్రలు చేయాలంటే నటీమణులకు సవాలుతో కూడుకున్న పని. అద్దె గర్భాన్ని మోసే మహిళలా నటించడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న కథానాయికలు అలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పాత్ర ఒక్కటి చేసిన అది.. పది సినిమాలతో సమానం అంటున్నారు నేటి కథానాయికలు. అంతేకాకుండా ఇలాంటి సమాజిక అంశాలను వ్యక్తపరిచే పాత్రలు, ప్రేక్షకుల్లో ఎప్పటికి గుర్తుండిపోతాయని వెల్లడిస్తున్నారు. కాగా సినిమాల్లో ఇలా అద్దె గర్భం మోసిన కథానాయికల లిస్ట్ పెద్దగానే ఉంది. సరోగసి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలేంటో చూద్ధాం.
యశోద:
కెరీర్ బిగెనింగ్ నుండే నటన ప్రధాన్యమున్న పాత్రలను ఎంచుకంటూ వస్తుంది ఈ చెన్నై సొగసరి. తాజాగా ఈమె ‘యశోద సినిమాలో అద్దె గర్భం మోసే మహిళ పాత్రలో నటించింది. అద్దె గర్భం పేరుతో చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాలను బయటపెట్టే కథాంశంలో ఈ చిత్రం రూపొందించింది. హరీ-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజై మంచి విజయం సాధించింది.
మిమీ:
మిమి అనే డ్యాన్సర్ బాంబే వెళ్లి హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. దాంతో తనకు డబ్బు అవసరముంటుంది. అదే టైమ్‌లో ఓ ఫారిన్ కపుల్ సరోగేట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మిమి కనిపిస్తుంది. ఇక ఆ ఫారిన్ కపుల్ ఎలాగోలాగో మిమీతో బిడ్డను కనడానికి డీల్ కుదిరించుకుంటారు. అయితే ఆ ఫారిన్ కపులు కొన్ని నెలల తర్వాత ఏవో కారణాల వల్ల బిడ్డను వద్దనుకుంటారు. వాళ్ళు ఎందుకు బిడ్డను వద్దనుకున్నారు. బిడ్డను వద్దనడంతో మిమి జీవితం ఎలా అయింది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాతో కృతిసనన్ నటనతో ఒక మెట్టు ఎక్కేసింది. ఇప్పటివరకు గ్లామర్ సినిమాలతోనే ఆకట్టుకున్న కృతి మిమి చిత్రంలో గర్భం దాల్చే పాత్రలో నటించి గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. ఇలాంటి పాత్రలను చేయడమే సవాలంటే.. కృతి ఈ పాత్ర కోసం 15కిలోల బరువు కూడా పెరిగింది. ఒక పాత్రకు పూర్తి న్యాయం చేయాలంటే అందులో పరకాశ ప్రవేశం చేయాలి. పాత్రకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి అంటూ బరువు పెరగడంపై వివరణ ఇచ్చింది.
ఫిల్హాల్:
మెఘనా గుల్జార్ ఈ చిత్రంతోనే దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టబు, సుష్మితా సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాలో టబు, సుష్మితా సేన్ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటారు. అయితే టబు ఈ చిత్రంలో పిల్లలు కనలేక భాదపడుతుంటుంది. దాంతో సంతానలేమితో బాధపడుతున్న తన స్నేహితురాల కోసం సుష్మితా బిడ్డను కనడానికి ముందుకొస్తుంది. ఆ తర్వాత వీళ్ల జీవితం ఎలా మారింది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అద్దె గర్భాన్ని మోసే తల్లిగా సుష్మిత నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి.
చోరి చోరి చుప్కే చుప్కే:
సల్మాన్ ఖాన్, రాణీ ముఖర్జీ, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2001లో రిలీజైంది. సల్మాన్, రాణీ ముఖర్జీ కపుల్‌గా నటించిగా.. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో అద్దె గర్భం పద్ధతిలో పిల్లల్ని పొందాలని అనుకుంటారు. దానికోసం వేశ్యగా జీవితం కొనసాగిస్తున్న ప్రీతిజింటను అద్దె గర్భం కోసం ఆశ్రయిస్తారు. ఇక ప్రీతి జింటా సరోగసీ తల్లిగా మారడానికి ఒప్పుకుంటుంది. సరోగసి తల్లిగా ప్రీతిజింటా నటన వర్ణనాతీతం. ఈ చిత్రంలో ప్రీతిజింటా నటనకు ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది.
దూస్రీ దుల్హాన్:
షబానా అజ్మీ, షర్మిలా ఠాగూర్, విక్టర్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1983లో రిలీజైంది. పిల్లలు లేని జంట అద్దె గర్భం కోసం వేశ్యను సంప్రదిస్తారు. ఆమె ద్వారా పిల్లల్ని కని మాతృత్వాన్ని పొందాలనుకుంటారు. ఇప్పుడంటే సరోగసి మీద కాస్త అవాగాహాన ఉంది. అప్పట్లో ఆ మాటంటేనే ఎవరకి తెలియదు. తెలిసిన వాళ్లు అద్దె గర్భం గురించి మాట్లాడలంటే సిగ్గు పడేవారు. అలాంటి సమయంలో ఈ సినిమా వచ్చింది. లేఖ్ టాండన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అద్దె గర్భాన్ని మోసే మహిళగా షబానా అజ్మీ నటించింది.
9 నెలలు:
సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన 9 నెలలు సినిమా కూడా సరొగసి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కింది. ప్రమాదంలో గాయపడ్డ తన భర్తను బతికించుకునేందుకు సరోగసి తల్లిగా మారేందుకు సిద్ధమైన ఓ మహిళ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా కేవలం 15 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సౌందర్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి.
వీటితో పాటుగా ‘వెలకమ్ ఒబామా’, ‘దసరతనమ్’, ‘ఐ ఆమ్’ వంటి సినిమాలు సరోగసి నేపథ్యంలో తెరకెక్కాయి. కాగా ‘వెల్కమ్ ఒబామా’, ‘మిమి’ సినిమాలు ‘మాలా ఆయ్ వ్హయ్చా’ అనే మరాఠా సినిమాకు రీమేక్‌గా తెరకెక్కాయి. ఈ మరాఠా చిత్రానికి బెస్ట్ ఫిలిం కేటగిరిలో నేషనల్ అవార్డు వచ్చింది.