Itlu Maredumilli Prajaneekam | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ట్రైలర్..!
Itlu Maredumilli Prajaneekam trailer | సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్. యువ దర్శక, నిర్మాతలకు కామెడీ జోనర్లో సినిమా చేయాలంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్. అంతలా ఈయన తన నటన, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటాడు.
Itlu Maredumilli Prajaneekam trailer | సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్. యువ దర్శక, నిర్మాతలకు కామెడీ జోనర్లో సినిమా చేయాలంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్. అంతలా ఈయన తన నటన, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటాడు. అయితే గతేడాది నరేష్ తన సేఫ్ జానర్ అయిన కామెడీని పక్కన పెట్టి.. ‘నాంది’ వంటి సిరీయస్ సబ్జెక్ట్‌తో వచ్చి బ్లాక్‌బస్టర్ విజయం సాధించాడు. దశాబ్ద కాలం తర్వాత ఈ సినిమాలో మళ్లీ పూర్తి స్థాయి సీరియస్ రోల్లో నటించాడు. ఈ సినిమా నరేష్‌కు కమర్షియల్‌గా మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మరోసారి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి సీరియస్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
ఏ.ఆర్ మోహన్ దర్వకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడీయోస్, హస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడు. అడవి ప్రాంతంలో ఉండే ఓ ఊరికి అల్లరి నరేష్ ఎలక్షన్ అధికారికగా వెళ్తాడు. అయితే అక్కడి ప్రజలను, రాజకీయ నాయకులు ఓట్లు గానే చూస్తుంటారు. కనీస అవసరాలకు కూడా ఏ విధమైన సహాయం చేయరు. దాంతో నరేష్ ఆ ఊరు ప్రజలతో కలిసి రాజకీయ నాయకులలో ఏ విధంగా మార్పు తెచ్చాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్‌తోనే మేకర్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో నరేష్‌కు జోడీగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫేం ఆనంది హీరోయిన్గా నటించింది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజు కీలకపాత్రలో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

