దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు. బాహుబలి సినిమా రిలీజ్ టైంలో ప్రచార చిత్రాలను వెరైటీగా విడుదల చేస్తూ మూవీపై ఆసక్తి పెంచాడు. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టాడు.
తాజాగా చిత్రం నుండి దోస్తీ అనే సాంగ్ విడుదల చేశారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఐదు భాషల్లో రూపొందిన ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ పాట ఐడియా మొత్తం ఎస్.ఎస్.కార్తికేయదేనని తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు రాజమౌళి.
ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ సాంగ్ చిత్రీకరణలో ఉన్నప్పుడు దోస్తీ వీడియా సాంగ్ గురించి చెప్పాడు కార్తికయ. కొరియోగ్రాఫర్ సతీష్, దినేష్కృష్ణన్తో కలిసి కార్తికేయ ఈ వీడియో రూపొందించారు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో భాషల్లో ఈ పాటను ఆలపించిన అమిత్ త్రివేది, అనిరుద్, విజయ్ యేసుదాసు థ్యాంక్స్. పాటకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు’’ అని జక్కన్న స్పష్టం చేశాడు.
It was @ssk1122’s idea to shoot the music video. I was shooting the #RRRMovie climax song. He and @dancersatz shot #Dosti with @dineshkrishnanb. Great job boys…
— rajamouli ss (@ssrajamouli) August 2, 2021
I was quite happy with how it turned out but didn't expect this wonderful response.