Rajamouli | ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకడిగా రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీసిన ప్రతి సినిమా కూడా హిట్టే. చిన్న సినిమా అయిన పెద్ద సినిమా అయిన బాక్సాఫీస్‌ని షేక్ చేయాల్సిందే.ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు,దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకోగా, ఆ షెడ్యూల్ తరువాత మహేష్ బాబు ఫ్యామిలీతో సమ్మర్ టూర్ కు వెళ్ళాడు, రీసెంట్ గానే మళ్లీ ఆయన హైదరాబాద్ లో అడుగు పెట్టి ఇప్పుడు షూట్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.
హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో.. కంటీన్యూగా నెల రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా , మూవీ కోసం రాజమౌళి భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. సాధారణంగా రాజమౌళి స్టార్ హీరోలను మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్ గా రికార్డ్ సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన మహేష్ బాబు సినిమాకు 200 కోట్ల రూపాయల వరకు తీసుటున్నట్లు ఐఎండీబీ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. SSMB29 ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబు కంటే రెండింతల భారీ రెమ్యూనరేషన్ రాజమౌళి తీసుకుంటున్నారు అనే వార్త బయటకు రాగా, అందరు నోరెళ్లపెడుతున్నారు.
రాజమౌళి రెమ్యునరేషన్‌తో పాటు ఈ మధ్య సినిమా ప్రాఫిట్స్ లో కూడా షేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు సినిమా కోసం కూడా షేర్ తీసుకునే చాన్స్ ఉందంటున్నారు. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో SSMB 29 ప్రాజెక్ట్ తెరకెక్కుతుండగా, ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా రూపొందుతుంది. ఇందులో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ షెడ్యుల్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేయబోతున్నారు. హీరో, హీరోయిన్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాటు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఈషెడ్యుల్ లో భాగం కాబోతున్నారు. అంతే కాదు ఈ భారీ యాక్షన్ సీన్ కోసం 3 వేల మంది ఆర్టిస్టులను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది