Pushpa The Rule Trailer | ఎప్పుడెప్పుడా అని అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురు చూసిన పుష్ప ట్రైలర్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రావడం రావడమే అన్ని యూట్యూబ్‌లో ఉన్న అన్ని రికార్డులను కొల్లగొడుతుంది ఈ ట్రైలర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ (Pushpa 2 Trailer) వాటిని అందుకొని మంచి వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. అయితే ట్రైలర్ చూసిన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శకులు ప్రశాంత్ వర్మతో పాటు, హారీశ్ శంకర్, రిషబ్ శెట్టి, అనిల్ రావిపూడి తదితరులు ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.
ఇప్పుడు తాజాగా దర్శక దిగ్గజం రాజామౌళి కూడా ఈ సినిమా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న చెలరేగుతోంది. పార్టీ కోసం వెయిట్ చేయలేకపోతున్నా పుష్ప అంటూ రాజమౌళి రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
WILDFIRE started in Patna!!
Spreading across the country!!
Explodes on Dec 5th!!!CAN’T WAIT for the party PUSHPA!!!
— rajamouli ss (@ssrajamouli) November 18, 2024