Director | ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు అందరు తెల్లారింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సప్‌లో మునిగి తేలుతూనే ఉంటారు. కాని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వాట్సప్ అనేదే వాడడట. మరి ఈ రోజుల్లో వాట్సప్ వాడకుండా ఉన్న ఆ డైరెక్టర్ మరెవరో కాదు సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. రియాలిటీకి దగ్గరగా ఉండే ఆయన సినిమాలు ప్రేక్షకులని కూడా ఎంతగానో అలరిస్తుంటాయి. జూన్ 20న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుబేరలో ధనుష్ హీరోగా నటించగా, రష్మిక మందన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నక్రమంలో ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్గా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలు కూడా పెంచాయి. కుబెరా సినిమా టైటిల్ ప్రకటించి అందులో నాగార్జున నటిస్తున్నారనే వార్త నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత ఈ సినిమాలో ధనుష్ కూడా ఉన్నారని తెలిసినప్పుడు నా అంచనాలు రెట్టింపు అయ్యాయి. మైండ్ బ్లాక్ అయింది.
ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు నిజంగా అదిరిపోయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ చూడాలా? అనే ఆసక్తిని పెంచింది అని రాజమౌళి చెప్పారు. ఇక శేఖర్ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారు. శేఖర్ చాలా సాప్ట్ గా ఉంటారు. తన సిద్ధాంతాలకు ఏది అడ్డు వచ్చినా కొంచెం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరు. అందుకే ఆయనంటే ఎంతో గౌరవం. మీరు వాట్సాప్ వాడుతారా అని శేఖర్ కమ్ములను రాజమౌళి అడగ్గా.. తాను ఉపయోగించనని అన్నారు. దాంతో అందరు అవాక్కయ్యారు. ఈ జనరేషన్లో వాట్సాప్ వినియోగించకుండా ఉండడం అన్నది నిజంగా చాలా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. అలానే కుబేర శేఖర్ కమ్ములకి మంచి హిట్ అందించాలని ప్రార్ధిస్తున్నారు.