Student No.1 | ‘స్టూడెంట్ నెం 1’ కు 20 ఏళ్లు..బడ్జెట్ ఎంత, వచ్చిందెంత..?
రాజమౌళి (SS Rajamouli) ఇండస్ట్రీకి వచ్చి చూస్తుండగానే 20 ఏళ్లు పూర్తైపోయింది. ఈయన తొలిసారి సినిమా కోసం మెగాఫోన్ పట్టి అప్పుడే రెండు దశాబ్ధాలు అయిపోయింది. స్టూడెంట్ నెం 1 (Student No.1) సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాజమౌళి.

చూస్తుండగానే రాజమౌళి (SS Rajamouli) ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తైపోయింది. ఈయన తొలిసారి సినిమా కోసం మెగాఫోన్ పట్టి అప్పుడే రెండు దశాబ్ధాలు అయిపోయింది. స్టూడెంట్ నెం 1 (Student No.1) సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాజమౌళి. దాని కంటే ముందు రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం సీరియల్ ను డైరెక్ట్ చేసాడు దర్శక ధీరుడు. అది చేస్తున్నపుడే ఆయన సత్తా గ్రహించిన రాఘవేంద్రరావు.. శిష్యుడికి సినిమా అవకాశం ఇచ్చాడు. అలా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా స్టూడెంట్ నెం 1 సినిమాకు ముహూర్తం పెట్టారు. దర్శకుడు రాజమౌళి అయినా కూడా దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం రాఘవేంద్రరావు చేసాడు. ఈ చిత్రం కోసం అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు దర్శకేంద్రుడు.
2001 సెప్టెంబర్ 27న పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైంది స్టూడెంట్ నెం 1. దీనికి ముందు నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడు అంటూ రూపు రేఖల్లో అనిపించుకున్నా.. ఇమేజ్ లో మాత్రం అది సంపాదించుకోలేకపోయాడు. అలాంటి సమయంలో రాజమౌళితో ఈయనకు పరిచయమైంది. అలా స్టూడెంట్ నెం 1 మొదలైంది. ఎక్కువగా శాంతి నివాసం సీరియల్ ఆర్టిస్టులే ఈ సినిమాలో కనిపిస్తారు. వాళ్లతోనే కథను నడిపించాడు రాజమౌళి. 2 కోట్ల లోపు బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి 2.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే సంచలనమే రేపింది స్టూడెంట్ నెం 1. అప్పటి వరకు ఎలాంటి మార్కెట్ లేని ఎన్టీఆర్.. ఈ సినిమాతో 12 కోట్లు షేర్ వసూలు చేసి నిర్మాతలకు, బయ్యర్లకు 5 రెట్లు లాభాలు తీసుకొచ్చాడు. 73 సెంటర్లలో 50 రోజులు.. 42 సెంటర్లలో 100 రోజులు.. ఆదోనిలోని థియేటర్ లో 217 రోజులు ప్రదర్శించబడింది స్టూడెంట్ నెం 1. ఈ సినిమా అన్నిచోట్లా విజయదుందుభి మోగించింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో సింహాద్రి, యమదొంగ వచ్చాయి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి..
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

