Rajamouli| తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో ముందు వరుసలో రాజమౌళి ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ప్రయాణం స్టూడెంట్ నెం1 చిత్రం తో మొదలు కాగా, ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో కొనసాగుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఓటమి అనేది ఎరగలేదు. తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. అనేక అవార్డులు దక్కించుకుంది. తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా అయితే ఏకంగా ఆస్కార్ అవార్డ్ కూడా సాధించింది.అ ప్పటిదాకా ఉన్న ట్రాక్‌ని ఉన్నట్టుండి కొత్త ఒరవడిలో నడిపించిన జక్కన్న మగధీర చిత్రంతో అందరు నోరెళ్లపెట్టేలా చేశాడు.ఈ సినిమా ప్రాంతీయ సినిమాగానే కాదు, షేర్‌ఖాన్… సాంకేతికంగానూ మనవాళ్లు తోపులు. మన టెక్నీషియన్లకు నేషనల్ అవార్డులు వచ్చితీరాల్సిందేనని గట్టిగా సౌండ్ చేసింది
మగధీర సినిమాకు బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు దక్కాయి. ఇక బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా క్రేజ్ ఎల్లలు దాటేలా చేశాడు. బాహుబలిని విడుదల చేసి అందులో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్ట్ ప్రపంచం మొత్తం డిస్కస్ చేసేలా మారింది. ఈ సినిమాకి ఉత్తమ సినిమా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీల్లో ఫస్ట్ పార్టు అవార్డు తెస్తే, రెండో భాగానికి మూడు అవార్డులు వరించాయి. ఇక బాహుబలి2 సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర 1500 కోట్లకి పైగా వసూళ్లు సాధించి అందరు నోరెళ్లపెట్టేలా చేసింది.
ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇద్దరు స్టార్ హీరోలని బ్యాలెన్స్ చేస్తూ జక్కన్న చెక్కిన శిల్పం హాలీవుడ్ స్టార్స్‌ని కూడా అట్రాక్ట్ చేసింది. ఈ చిత్రానికి ఆస్కార్‌తో పాటు అరడజను అవార్డ్లు కూడా వచ్చాయి.ఇక ఇవే కాక రాజమౌళి తీసిన ఈగ, మర్యాద రామన్న వంటి చిత్రాలు కూడా అవార్డులతో పాటు అశేష ఆదరణ పొందాయి. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో మహేష్ బాబుని గతంలో ఎప్పుడు చూడని విధంగా చూపించబోతున్నాడట. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.