Bahubali Part-3 | రాజమౌళి నుంచి బిగ్ అప్డేట్.. ‘బాహుబలి-3’ ఖచ్చితంగా ఉంటుందని వెల్లడి
'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి. భారతదేశం గర్వించ దగ్గ దర్శకులలో ఈయన ముందువరుసలో ఉంటాడు.
Bahubali Part-3 | ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి. భారతదేశం గర్వించ దగ్గ దర్శకులలో ఈయన ముందువరుసలో ఉంటాడు. పోస్టర్‌పై ఈయన పేరు ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తారు. ప్రేక్షకుడు ఎంత ఖర్చుపెట్టి టికెట్ కొనుక్కున్నా దానికి రెట్టింపు ఎంటర్టైనమెంట్ ఈయన సినిమాలలో ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోల సైతం ఈయన సినిమా వస్తుందంటే వాళ్ళ సినిమాలను నాలుగు నెలలు వాయిదా వేసుకోవాలి అంటూ వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన ‘ట్రిపుల్ ఆర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రం బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది.
ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి ఓ ఇంటర్వూలో పాల్గొన్నాడు. ఇంటర్వూలో యాంకర్ ‘బాహుబలి పార్ట్-1’, పార్ట్2 రూపొందించారు.మీ నుంచి ‘బాహుబలి పార్ట్-3’ ఎక్స్పర్ట్ చేయవచ్చా అని ప్రశ్నించగా దానికి ‘రాజమౌళి తప్పకుండా ఉంటుంది. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను చూపించనున్నాం. ఇప్పటికే దీనిపై వర్క్‌ను కూడా స్టార్ట్ చేశాం. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా దీనికి రెడీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కంచడానికి టైం పట్టచ్చు కానీ త్వరలోనే దీని గురించి ఆసక్తికర వార్త రానుంది’ అని వెల్లడించాడు. దీంతో బాహుబలి ప్రియులు బాహుబలి పార్ట్3 కోసం వెయింటింగ్ అంటూ పోస్ట్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఇక ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం అత్యంత గ్రాండ్‌గా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివీవీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై డివీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించాడు. ఆలియా భట్, ఒలీవియా మోర్రీస్ కథానాయికలుగా నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

