Rajamouli | భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి. ఆయన కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ లేదు. తీసిన ప్రతి సినిమా సెన్సేషన్. సినిమా సినిమాకి అంచనాలని పెంచేస్తూ హాలీవుడ్ రేంజ్లో చిత్రాలు తెరకెక్కిస్తున్నారు జక్కన్న. చివరిగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు సినిమాని ప్రపంచంలో ఇంకా పై స్థాయికి తీసుకెళ్లింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి కాగా, మరి కొద్ది రోజులలో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నాడు.
అయితే రాజమౌళి ఎన్ని చిత్రాలు చేసిన ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అది మరెదో కాదు మహాభారతం. ఎన్నో ఏళ్ళు క్రితమే రాజమౌళి మహాభారత కావ్యాన్ని తెరకెక్కించడం తన జీవిత లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ఇది చేయడానికి చాలా సమయం పడుతుందనన్నారు. జక్కన్నకి మన పురాణాలు, ఇతిహాసాలు పట్ల ఉన్న గ్రిప్ ఉండడంతో మహాభారతాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తాడని అందరు అనుకుంటున్నారు. ఆరు సంవత్సరాలు పాటు నాలుగు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ చేయనున్నారని, ఇందులో సూపర్ స్టార్స్ భాగం కానున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. రాజమౌళి, మహాభారతం చేస్తే ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫిక్స్ అని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా మరో నటుడి పేరు కూడా ఫిక్స్ అయింది. హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా దర్శక ధీర రాజమౌళితో పాటు హిట్ 1, 2 హీరోలు విశ్వక్ సేన్, అడివి శేష్ గెస్టులుగా హాజరయ్యారు. కలర్‌ఫుల్ గా జరిగిన వేడుకలో యాంకర్ సుమ సరదాగా నిర్వహించిన స్టేజి ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన అప్డేట్ రాబట్టింది. రాజమౌళి డ్రీం ప్రాజెక్టు అయిన మహాభారతంలో నాని క్యారక్టర్ ఫిక్స్ అయిందని రూమర్స్ వస్తున్నాయి. ఇది నిజమేనా అని సుమ ప్రశ్నించింది. దానికి జక్కన్న ఠక్కున బదులిస్తూ నాని డెఫినిట్ గా ఉంటాడని చెప్పడంతో ప్రాంగణంలో ఉన్న ఆడియన్స్ చప్పట్లతో హోరెత్తిపోయింది. పాత్ర ఏంటనేది రివీల్ చేయకపోయిన, జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ లో నాని ఉంటాడని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక నానికి ఏ పాత్ర అయితే బాగుంటుందో అని ఆలోచనలు చేస్తున్నారు.