Rajamouli-M.M.Keeravani | ఎప్పుడెప్పుడా అని ఏండ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఆస్కార్‌ను ఆర్ఆర్ఆర్ బృందం తీసుకొచ్చింది. బెస్ట్ ఒరినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్‌ను గెలుచుకుంది. వేదికపై కీరవాణి, చంద్రబోస్‌లు అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ వేడుకల అనంతరం రాజమౌళి, కీరవాణి దంపతులు, కార్తికేయ, సింహా, కాలభైరవలు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు వీళ్లకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆర్ఆర్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ.. ఆస్కార్ గెలిచినందుకు అభినందనలు తెలిపారు.
ట్రిపుల్ఆర్ బృందంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. రాజమౌళి జై హింద్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఇటీవలే తారక్ రాగా.. జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇక ఎన్టీఆర్ ఆస్కార్ రావడంపై చాలా అనందంగా ఉందంటూ ఉప్పొంగిపోయాడు. మన దేశబరువు ఎంతుందో ఆస్కార్ బరువు కూడా అంతే ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇక రామ్‌చరణ్, తన సతీమణి ఉపాసనతో దిల్లీలో లాండ్ అయ్యాడు. శుక్రవారం ఉదయం ఇండియా టుడే కాన్ క్లేవ్లో అతిథిగా పాల్గొననున్నాడు.
#WATCH | Telangana: RRR Director SS Rajamouli and Music composer MM Keeravani reach Rajiv Gandhi International Airport in Hyderabad.
'Naatu Naatu' song from RRR won the #Oscar for the Best Original Song pic.twitter.com/ismDbDAQ3t
— ANI (@ANI) March 16, 2023
National Media and Telugu Media at "New Delhi" Airport for a Video byte from The Global Star ✨ @AlwaysRamCharan about the RRR's #Oscars Triumph! 🙏 pic.twitter.com/gtqOhE2qkD
— Ujjwal Reddy (@HumanTsunaME) March 17, 2023