జై జాస్తి, అవంతిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజమండ్రి రోజ్మిల్క్’. నాని బండ్రెడ్డి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఇంట్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘టీజర్‌కు మంచి స్పందన వస్తున్నది. ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. కాలేజి రోజుల్లో మరపురాని సంఘటనలను, మధురానుభూతులను ఈ చిత్రం అందరికి జ్ఞప్తికి తెస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మంచి సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది’ అన్నారు. సన్నీల్కుమార్, వెన్నెలకిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్, కెమెరా: శక్తి అరవింద్, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్.