ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. హీరోగాను, విలన్‌గాను నటిస్తూ మెప్పిస్తున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో కార్తికేయ విలన్‌గా మారిపోయారు. ఇప్పుడు అజిత్ వలిమై చిత్రంలోనూ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఇక కార్తికేయ హీరోగా రాజా విక్రమార్క అనే సినిమా రూపొందుతుండగా, దీనికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.
మెగా హీరో వరుణ్ తేజ్ కొద్ది సేపటి క్రితం రాజా విక్రమార్క టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ అంతా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇందులో ఎన్ఐఏ ఏజెంట్‌గా కార్తికేయ కనిపించనుండగా, చిన్నప్పుడు కృష్ణ చిత్రాలు, పెద్దయ్యాక టామ్ క్రూజ్ చిత్రాలు చూసి అలాంటి జాబ్ ఎంచుకున్నాడు. కాని దాని వలన అతనికి లేనిపోని కష్టాలు వస్తున్నాయి. టీజర్ చాలా ఆసక్తికరంగా మారింది.
కార్తికేయ హీరోగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటిస్తున్న రాజా విక్రమార్కచిత్రాన్ని రామా రెడ్డి తెరకెక్కిస్తుండగా.. శ్రీ సారిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి కుమార్, తనికెళ్ల భరణి, పశుపతి, హర్ష వర్దన్, సుధాకర్ కొమాకుల, సూర్య, జెమినీ సురేష్ వంటి వారు నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందిస్తున్నారు.